: ఎడ్లబండిపై నారాయణ నిరసన... అరెస్ట్ చేసిన అనంత పోలీసులు
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ బుధవారం వినూత్న నిరసనకు దిగారు. ఎన్నికల హామీలను అమలు చేయాలంటూ ఆ పార్టీ నేతలు అనంతపురంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో నారాయణ కూడా పాల్గొన్నారు. అందులో భాగంగా నారాయణ ఎడ్లబండితో కలెక్టరేట్ లోకి ప్రవేశించేందుకు యత్నించారు. ఈ సందర్భంగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు నారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో సీపీఐ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి, పీఎస్ కు తరలించారు.