: మమతతోనా... కలిసేది లేదు: తేల్చిచెప్పిన లెఫ్ట్
బీజేపీని అడ్డుకునేందుకు వామపక్ష పార్టీలతో కలుస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ప్రతిపాదనను లెఫ్ట్ పార్టీల నేతలు తిరస్కరించారు. మమతతో కలసి పని చేసే అవకాశాలే లేవని సీపీఎం నేత సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ లోకి మతతత్వ పార్టీలు ప్రవేశించడానికి మమతే కారణమని ఆయన ఆరోపించారు. అంతకుముందు, కాంగ్రెస్ ముందుండి నడిపిస్తే వామపక్ష పార్టీలతో కలసి పనిచేసేందుకు సిద్ధమని మమతా బెనర్జీ ప్రకటించిన విషయం తెలిసిందే.