: వరవరరావు ఇంటిముందు చింతపల్లి గిరిజనుల ధర్నా
హైదరాబాదులోని విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు ఇంటి ముందు బుధవారం ఉదయం విశాఖ జిల్లా చింతపల్లికి చెందిన గిరిజనులు ధర్నాకు దిగారు. తమకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందని, మావోల నుంచి తమను రక్షించాలన్న డిమాండుతో వారు ఆందోళన చేస్తున్నారు. చింతపల్లి ఏజెన్సీలో గత నెల 21న మావోలపై తిరుగుబాటు చేసిన గిరిజనులు, ముగ్గురు మావోయిస్టు దళ సభ్యులను హతమార్చారు. ఈ నేపథ్యంలోనే తమకు మావోల నుంచి ముప్పు పొంచి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మావోల నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు వరవరరావును కోరారు.