: పోస్టాఫీసుల్లోనూ శ్రీవారి దర్శనం టికెట్లు


తిరుమలలో శ్రీవారి శీఘ్ర దర్శనానికి విక్రయించే రూ. 300 టికెట్లు త్వరలో పోస్టాఫీసుల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. టీటీడీ సంయుక్త కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరాజు, తిరుపతి పోస్టల్‌ సూపరింటెండెంట్‌, ఇతర అధికారులు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రోజువారీ కోటాకు అనుగుణంగా ఇంటర్నెట్‌, టీటీడీ ఈ-దర్శన్‌ కౌంటర్లలో రూ.300 టికెట్ల విక్రయం సాగుతోంది. మారుమూల గ్రామాల్లోని భక్తుల కోసం ఇక ఆన్‌లైన్‌ ద్వారా పోస్టాఫీసుల్లోనూ టికెట్ల అమ్మకాలు సాగనున్నాయి.

  • Loading...

More Telugu News