: ఫిజీకి అభయమిచ్చిన మోదీ


ఫిజీలో సాంకేతికత మరింతగా అభివృద్ధి చెందేందుకు భారత్ సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అభయమిచ్చారు. ఫిజీ పార్లమెంటులో ఆయన ప్రసంగించారు. దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఆధునికీకరణ కోసం 5 మిలియన్ డాలర్లను తక్షణ సాయంగా మోదీ ప్రకటించారు. మరో 70 మిలియన్ డాలర్లను దశలవారీగా అందిస్తామని తెలిపారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఫిజీ యువత ప్రపంచ దేశాలతో పోటీ పడాలని ఆయన అభిలషించారు. ఫిజీలో పాడి పరిశ్రమ అభివృద్ధికి భారత్ తన వంతు సహకారాన్ని అందిస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News