: ఇన్ స్టాగ్రాంలో మోదీ మూడో పోస్ట్...సువా సుందర తీరం!


సోషల్ మీడియాను వినియోగించడంలో అందరికంటే ముందున్న ప్రధాని నరేంద్ర మోదీ గతవారం ఇన్ స్టాగ్రాంలో చేరిన సంగతి తెలిసిందే. విదేశీ పర్యటనలో ఉన్నా, మోదీ సోషల్ మీడియాను మాత్రం వదలడం లేదు. ఇప్పటికే ఇన్ స్టాగ్రాంలో రెండు ఫొటోలను పెట్టిన మోదీ, తాజాగా బుధవారం మూడో పోస్టింగ్ ను అందులో అప్ లోడ్ చేసేశారు. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఫిజీ పర్యటనకు వెళ్లిన మోదీ, అక్కడి సువా పట్టణంలోని ఫసిపిక్ సుందర తీరాన్ని క్లిక్ మనిపించి, ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ‘బులా ఫ్రం ఫిజీ! పసిఫిక్ తీరంపై... సుందర ప్రజల మధ్య’ అంటూ దానికి ట్యాగ్ తగిలించేశారు.

  • Loading...

More Telugu News