: బాబా రాంపాల్ ఆశ్రమ ఘర్షణల్లో 200 మందికి గాయాలు


హర్యానాలోని బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద మంగళవారం జరిగిన ఘర్షణల్లో దాదాపు 200 మంది దాకా గాయపడ్డారు. రాంపాల్ ను, అతడి ప్రధాన అనుచరుడిని అరెస్ట్ చేసేందుకు మంగళవారం దాదాపు 30 వేల మంది పోలీసులు ఆశ్రమానికి వచ్చారు. అయినా రాంపాల్ ను కాని, ఆయన అనుచరుడిని కాని పట్టుకోలేకపోయారు. ఆశ్రమానికి వచ్చిన బలగాల్లో పోలీసులతో పాటు అల్లర్లను అణచివేయడంలో దేశంలోనే పేరు ప్రఖ్యాతులున్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు కూడా రంగంలోకి దిగినా ఫలితం రాకపోవడం గమనార్హం. రాంపాల్ ప్రైవేట్ సైన్యం పోలీసులపైకి దాడికి దిగితే, పోలీసులు మాత్రం మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు. గాయపడ్డ వారిలో బాబా భక్తులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు ఉన్నారు. ఆశ్రమంలోనే రహస్య ప్రదేశంలో బాబా ఉన్నాడని భావిస్తున్న హర్యానా పోలీసులు, ఆయనను బయటకు రప్పించేందుకు ఆశ్రమానికి నీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పాటు బయటి నుంచి ఆహార పదార్ధాలను అనుమతించడం లేదు. మరి బుధవారమైనా బాబా బయటకు వస్తారో, లేక పోలీసులు మరికొంత కాలం వేచి చూడాల్సి వస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News