: స్మగ్లర్లు పారిపోయారు... ఎర్రచందనం మాత్రం మిగిలింది!
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దాదాపు 20 లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం పోలీసుల తనిఖీలో దొరికింది. అయితే ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్న వారు మాత్రం తప్పించుకుని పారిపోయారు. అనంతసాగరం మండలం పిలకలమర్రి వద్ద అటవీశాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు వాహనాల్లో తరలిస్తున్న 50కి పైగా ఎర్రచందనం దుంగలను స్వాదీనం చేసుకున్నారు. పోలీసులను చూసిన స్మగ్లర్లు వాహనాలను వదిలి పరారయ్యారు. పట్టుబడిన ఎర్రచందనాన్ని సీజ్ చేశామని, స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు.