: క్రికెట్ ప్రపంచ కప్ ను ఆవిష్కరించిన మోదీ, అబాట్
వచ్చే సంవత్సరం జరగనున్న వరల్డ్ కప్ క్రికెట్ లో విజేతకు అందించే ట్రోఫీని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ తో కలసి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, స్టీవ్ వా, మెక్ గ్రాత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మోదీ గౌరవార్థం అబాట్ విందు ఇచ్చారు. తదుపరి మోదీ ఫిజీ బయలుదేరి వెళ్లారు. ఆస్ట్రేలియా పర్యటనను తాను మరచిపోలేనని ప్రధాని వ్యాఖ్యానించారు.