: భారత్ లో తొలి ఎబోలా కేసు...ఢిల్లీలో బాధితుడికి చికిత్స


ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తోన్న ప్రాణాంతక వ్యాధి ఎబోలా తాజాగా భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో ఎబోలా సోకిన వ్యక్తిని ఢిల్లీ విమానాశ్రయ ఆస్పత్రిలోని ఐసోలేటెడ్ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. లైబీరియా నుంచి వచ్చిన సదరు వ్యక్తికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు, అతడికి ఎబోలా వైరస్ సోకిందని నిర్ధారించారు. వెనునెంటనే అక్కడి ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. దీంతో దేశంలోని మిగిలిన అన్ని విమానాశ్రయాల వద్ద వైద్య పరీక్షలను ముమ్మరం చేశారు.

  • Loading...

More Telugu News