: నేటి నుంచి పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు
తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా బ్రహ్మోత్సవాలకు ఆనవాయతీ ప్రకారం ఒక రోజు ముందుగా జరుపుతున్న లక్ష కుంకుమార్చనను మంగళవారం తెల్లవారుజామున ఆలయ అర్చకులు, వేద పండితులు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి నామాన్ని లక్షసార్లు స్తుతిస్తూ, ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మధ్యాహ్నం 12.30 గంటల దాకా లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదంగా అమ్మవారి కుంకుమను అందజేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ధ్వజారోహణ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.