: మళ్లీ పార్టీ జిల్లాల వారీ సమీక్షలకు జగన్ శ్రీకారం


వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ పటిష్టతకు సంబంధించి జిల్లాల వారీ సమీక్షలకు రేపటి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. బుధవారం గుంటూరు జిల్లా నేతలతో భేటీ కానున్న జగన్, ఈ నెల 21న విశాఖ జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. 22న పార్లమెంట్ లో పార్టీ వ్యవహరించాల్సిన వైఖరిపై ఆయన పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. ఈ మూడు భేటీలు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం లోటస్ పాండ్ లో జరగనున్నాయి. ఆ తర్వాత 24, 25 తేదీల్లో ప్రకాశం జిల్లా పార్టీ సమీక్షను జిల్లా కేంద్రం ఒంగోలులో చేపట్టనున్నారు. ఈ సమీక్షలకు స్వయంగా హాజరు కావడంతో పాటు ఆయా జిల్లాల్లో పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు, పార్టీ నేతల వ్యవహార తీరు, ఇతర పార్టీల బలాబలాలు తదితరాలపై ఆయన లోతుగా దృష్టి సారించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News