: భూములిచ్చే రైతులను పారిశ్రామికవేత్తలుగా తయారుచేస్తా: సీఎం చంద్రబాబు


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంత రైతులతో సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాలకు చెందిన రైతులతో ఆయన మాట్లాడుతూ, భూసమీకరణకు సానుకూలంగా ఉన్న రైతులు భయపడాల్సిన పనిలేదన్నారు. భూములిచ్చిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భూములు అప్పగించే రైతులను పారిశ్రామికవేత్తలుగా తయారుచేస్తానని అన్నారు. నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇప్పించి రైతులకు ఉజ్వల భవిష్యత్ ఇస్తామన్నారు. కేంద్రం నుంచి వచ్చే పరిశ్రమలన్నీ తొలుత రాజధాని ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. భూములిచ్చే కుటుంబాల్లో నిరుద్యోగులుంటే వారికి ఉద్యోగవకాశాలు కల్పిస్తామని చెప్పారు. హామీలతో సంతృప్తి చెందిన కొందరు రైతులు రాజధాని తమ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నందుకు గర్వంగా ఉందని ముఖ్యమంత్రితో చెప్పారు. కాగా, పరిహారం కింద కొందరు రైతులు సీఎంను 1200 గజాల స్థలం కోరారు. మరికొందరు 1200 గజాల స్థలంతోపాటు 200 గజాల వాణిజ్యభూమిని కూడా ఇవ్వాలన్నారు

  • Loading...

More Telugu News