: హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటైన ఆయుష్, అర్పిత


బాలీవుడ్ సూపర్ స్టార్ సోదరి అర్పిత వివాహం ఢిల్లీ వ్యాపారవేత్త ఆయుష్ శర్మతో హైదరాబాదులోని ఫలక్ నుమా ప్యాలెస్ లో ఘనంగా జరింది. ఆశీర్వాదాల నడుమ ఆయుష్, అర్పిత ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహానికి బాలీవుడ్ తారలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహ వేడుక కన్నులపండువగా సాగింది. మరికాసేపట్లో విందు కార్యక్రమం ఆరంభమవుతుంది. హైదరాబాద్ బిర్యానీ, హలీం, పత్తర్ కా ఘోష్ వంటి నోరూరించే వంటకాలు అతిథులకు వడ్డించనున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన వీఐపీలతో ప్యాలెస్ కళకళలాడుతోంది. కాగా, ప్యాలెస్ ఎదుట సల్మాన్ అభిమానులు భారీగా చేరుకున్నారు. కాగా, ఆయుష్, అర్పిత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News