: కొత్త బ్యాట్ల కోసం మీరట్ సిటీలో ధోనీ షాపింగ్
టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఆసీస్ పర్యటనకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆస్ట్రేలియాలో బౌన్సీ పిచ్ లు ఎదురుకానుండడంతో లైట్ వెయిట్ బ్యాట్ల కోసం ధోనీ మీరట్ వెళ్లాడు. ఈ యూపీ నగరం బ్యాట్ల పరిశ్రమకు ప్రసిద్ధికెక్కింది. ప్రఖ్యాత క్రికెట్ ఉపకరణాల సంస్థల ప్రధాన కార్యాలయాలు ఎక్కువగా మీరట్ లోనే ఉన్నాయి. కాగా, మీరట్ లో షాపింగ్ చేసిన సందర్భంగా ధోనీ మీడియాకు దూరంగా ఉన్నాడట. ధోనీ 1260 గ్రాముల బరువున్న 6 బ్యాట్లను తీసుకున్నట్టు తెలుస్తోంది. విల్లో నాణ్యత, స్ట్రోక్ ఆధారంగా టీమిండియా సారథి బ్యాట్లను ఎంపిక చేసుకున్నాడట. తనకు నచ్చిన బ్యాట్ల కోసం దాదాపు 5 గంటల పాటు తిరిగాడట ధోనీ. 2011లోనూ ధోనీ తన భార్య సాక్షితో కలిసి బ్యాట్లను కొనుగోలు చేశాడు.