: హైదరాబాదులో తప్పతాగి టెక్కీ వెంటపడిన పోలీసు


హైదరాబాదులో మెరుగైన పోలీసింగ్ తమ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతుండడం తెలిసిందే. ఆయన స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ప్రవర్తించాడో కానిస్టేబుల్. హైదరాబాదు జూబ్లీహిల్స్ లో తప్పతాగిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ఓ మహిళా టెక్కీపై వేధింపులకు దిగాడు. అంతకుముందు, రోడ్డుపై కనిపించిన ప్రతివారిపైనా తిట్ల వర్షం కురిపించాడు. మహిళా టెక్కీ అటుగా రావడంతో ఆమె వెంటపడ్డాడు. స్థానికులు నిలదీయగా, తనకేమీ తెలియదని బుకాయించాడు. అయితే, ఆ కానిస్టేబుల్ ను వారు బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News