: పోలీసులు కొట్టడంతో గర్భస్రావం


ఓ కేసు విషయంలో విచారించాలంటూ గర్భవతిని స్టేషన్ కు తీసుకువచ్చి ఆమెను తీవ్రంగా కొట్టి గర్భస్రావం కావడానికి కారణమయ్యాడో పోలీసు అధికారి. ఒడిశాలోని గంజాం జిల్లాలో జరిగింది ఈ ఘటన. ప్రతాపూర్ కు చెందిన మామి (26)ని అక్టోబర్ 25న జారద పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళారు. అక్కడి స్టేషన్ అధికారి ఆమెను విపరీతంగా కొట్టడంతో నెలలు నిండకుండానే ఆమెకు నొప్పులు వచ్చాయి. అనంతరం ఎంకేసీజీ వైద్యులు ఆపరేషన్ చేసి మృత శిశువును బయటకు తీసారు. బాధితురాలి బంధువులు డీఐజీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. మొత్తం ఉదంతంపై విచారణ జరిపించి బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తానని డీఐజీ అమితాబ్ ఠాకూర్ తెలిపారు.

  • Loading...

More Telugu News