: మోదీ ఎన్నారైగా మారిపోయారంటూ లాలూ వ్యాఖ్య


పది రోజుల్లో మూడు దేశాల్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నారైలా మారిపోయారని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇలా భారతీయులకు మోదీ అసలు అందుబాటులో ఉండటం లేదన్నారు. ఈ దేశానికి మోదీ ప్రధానిగా ఏమాత్రం వ్యవహరించడం లేదని ఆరోపించారు. ఎప్పుడూ తన భజన చేసే మీడియాను వెంటబెట్టుకు తిరుగుతూ, బూటకపు స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించి ఫొటోలు తీసుకుంటున్నారని లాలూ మండిపడ్డారు. స్వదేశంలో సరిహద్దు ప్రాంతం సమస్యల్లో ఉంటే, మోదీ మాత్రం విదేశాల్లో పాప్యులారిటీ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

  • Loading...

More Telugu News