: 'రాజధాని ప్రాంత సాధికార సంస్థ'కు ఛైర్మన్ గా చంద్రబాబు


ఏపీ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో సీఆర్డీఏ (రాజధాని ప్రాంత సాధికార సంస్థ) బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతులతో చర్చించిన తర్వాత దీనికి సంబంధించి అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకురావాలా? లేక బిల్లును ప్రవేశ పెట్టాలా? అనే విషయంతో తుది నిర్ణయానికి రావాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. రాజధాని ప్రాంత సాధికార సంస్థకు ఛైర్మన్ గా చంద్రబాబు వ్యవహరించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు, ఎన్టీఆర్ ఆరోగ్యసేవ పేరును ఎన్టీఆర్ వైద్యసేవగా మారుస్తూ తీర్మానించారు. ఎన్టీఆర్ వైద్య సేవ పరిమితిని రూ. 2.5 లక్షలకు పెంచారు. ఎన్టీఆర్ వైద్యసేవలో వ్యాధుల సంఖ్యను 938 నుంచి 1,038కి పెంచారు. మంగంపేట బైరైటిస్ గనుల్లో 2004 నుంచి అనేక అక్రమాలు జరిగాయని... దీనికి సంబంధించిన నివేదికలు కూడా వచ్చాయని... దీంతో, ఈ అక్రమాలపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అంతేకాకుండా, 2004 తర్వాత బైరైటిస్ గనుల తవ్వకాలకు జారీ చేసిన జీవోను కేబినెట్ రద్దు చేసింది. ఇసుక విధానంలో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమిక రంగం మిషన్ తీరుతెన్నులను ఈ సమావేశంలో సమీక్షించారు.

  • Loading...

More Telugu News