: కేసీఆర్ చర్యలు సిగ్గుచేటు... రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు: గీతారెడ్డి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి విరుచుకుపడ్డారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి, పార్టీ ఫిరాయింపులకు కేసీఆర్ పాల్పడుతున్నారని... ఇలాంటి చర్యలకు ఆయన పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆయన వ్యవహారశైలి రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించే రీతిలో ఉందని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులపై చర్చ కోసం రెండు రోజులుగా తాము పట్టుబడుతున్నప్పటికీ పట్టించుకోకపోగా... ఈ రోజు తమను ఏకంగా సభ నుంచి సస్పెండ్ కూడా చేశారని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చి దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీపైనే టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. తమను మార్షల్స్ తో బయటకు పంపడం దారుణమని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News