: క్రీడాకారులను ప్రోత్సహించడంలో తెలంగాణ దేశంలోనే ముందుంది: కేటీఆర్


క్రీడాకారులకు ప్రోత్సాహం అందించే విషయంలో దేశంలోనే తెలంగాణ ముందుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం నాటి సమావేశాల్లో భాగంగా చైనా సూపర్ సిరీస్ ను చేజిక్కించుకున్న సైనా, శ్రీకాంత్ లను అభినందించాలన్న సభ్యుల ప్రతిపాదనకు స్పందించిన సందర్భంగా కేటీఆర్ ఈ మేరకు ప్రకటించారు. క్రీడలతో పాటు క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం దేశంలో మరే రాష్ట్రం ఇవ్వడం లేదన్నారు. భవిష్యత్తులో కూడా క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి మెరుగైన ప్రోత్సాహం లభించనుందని ఆయన ప్రకటించారు. అనంతరం చైనా సూపర్ సిరీస్ విజేతలకు సభ అభినందనలు తెలుపుతూ తీర్మానం చేసింది.

  • Loading...

More Telugu News