: బోడితిప్ప జంక్షన్ లో రోడ్డు ప్రమాదం
తూర్పుగోదావరి జిల్లాలోని బోడితిప్ప జంక్షన్ లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరగిరిపట్నంకు చెందిన ఏడుగురు అల్లవరం వైపు వెళుతుండగా, అమలాపురం నుంచి వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నక్కా రామేశ్వరానికి చెందిన సత్యనారాయణ (40) అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. ఘటనాస్థలికి పోలీసులు చేరుకొని కేసును నమోదు చేసుకున్నారు. గాయపడిన వారిని అమలాపురం ఆసుపత్రికి తరలించారు.