: గోవాలో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం


గోవాలోని డంబోలిన్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. మంగళవారం ఉదయం 7:20 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఏఐ866 విమానం ముంబైకి బయలుదేరింది. రన్ వేపై టేక్ ఆఫ్ కు వెళుతుండగా తొలుత టైరు పేలింది. తర్వాత వెంటనే ఓ పక్షి గుద్దుకుంది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలెట్ చాకచక్యంగా బ్రేక్స్ వేసి విమానాన్ని నిలిపివేశాడు. మొత్తం 164 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారని అధికారులు తెలిపారు. ఘటనపై విచారణ జరిపిస్తున్నామని ముంబై ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు వివరించారు.

  • Loading...

More Telugu News