: 13 మంది కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
తెలంగాణ శాసనసభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసిన టీఎస్ ప్రభుత్వం ఈ రోజు 13 మంది కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేసింది. పదే పదే సభను అడ్డుకుంటూ సభాకార్యక్రమాలకు విఘాతం కలిగిస్తున్నారని... వీరందరినీ సభ నుంచి సస్పెండ్ చేయాలని సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు ప్రతిపాదించారు. వెంటనే స్పీకర్ ఒక రోజు పాటు 13 మంది కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సస్పెండైన కాంగ్రెస్ సభ్యుల్లో.. డీకే అరుణ, పువ్వాడ అజయ్ కుమార్, సంపత్ కుమార్, కోమటిరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, గీతారెడ్డి, జీవన్ రెడ్డి, కృష్ణారెడ్డి, పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రావు, రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి వెంకట్ రెడ్డి లు ఉన్నారు.