: ఓకే అనేది మీరే... వద్దనేది కూడా మీరేనా?: హరీష్ రావు
ప్రశ్నోత్తరాలకు అడ్డు తగులుతున్న కాంగ్రెస్ సభ్యులపై టీఎస్ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రశ్నోత్తరాలను చేపడదామని బీఏసీ సమావేశంలో కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి చెప్పారని... ఇప్పుడేమో ప్రశ్నోత్తరాలు వద్దు, తమ వాయిదా తీర్మానంపై చర్చించాలంటూ జానారెడ్డి పట్టుబడుతున్నారని హరీష్ ఆరోపించారు. బీఏసీలో ఓకే అన్న తర్వాత ఇప్పుడు వద్దని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ముఖ్యమైన ప్రజా సమస్యలపై చర్చించాల్సి ఉందని... సభకు అడ్డు తగలరాదని కాంగ్రెస్ సభ్యులకు హరీష్ విన్నవించారు.