: కార్పొరేట్ ల నియంత్రణలో బాబు ప్రభుత్వం
కార్పొరేట్ కంపెనీలు, బడా పారిశ్రామికవేత్తల నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణంపై ఆయన వైఖరిని దుయ్యబట్టారు. మంగళవారం నాడు విజయవాడలో రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ, రాజధాని కోసం మెట్ట ప్రాంతాలను వదిలేసి పంటపొలాలను ఎంపిక చేయడంపై బాబు ఉద్దేశం ఏంటో బహిర్గతం చేయాలని అన్నారు. రాజధానిలో కార్పొరేట్ మాఫియా పాదం మోపిందని, దానికి లాభం చేయటమే బాబు ముందున్న తక్షణ కర్తవ్యంగా అనిపిస్తోందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై పోరాటానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.