: బుర్ద్వాన్ పేలుడు నిందితుడు హైదరాబాదులో అరెస్ట్


బుర్ద్వాన్ పేలుడు నిందితుడు హైదరాబాదులో అరెస్టయ్యాడు. ఈ పేలుళ్లకు మయన్మార్ కు చెందిన ఖలీద్ కారకుడని నిర్ధారించుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పోలీసులు అతడి కోసం వేట సాగించారు. చివరకు అతడిని ఈరోజు హైదరాబాదులో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడి వద్ద నుంచి బాంబుల తయారీ సామగ్రితో బాటు పలు వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుర్ద్వాన్ పేలుళ్ల తర్వాత హైదరాబాదుకు మకాం మార్చిన ఖలీద్, తన పాత ప్రవృత్తిని మాత్రం వదలలేదు. అరెస్ట్ సందర్భంగా అతడి వద్ద లభించిన బాంబు తయారీ సామగ్రిని చూసిన పోలీసులు, ఒక్కసారిగా షాక్ కు గురైనట్లు సమాచారం. హైదరాబాదులోనూ పేలుళ్లకు ఖలీద్ ప్రణాళికలు రచించాడా? అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఖలీద్ కు ఇసిస్ ఉగ్రవాదులతో పాటు బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థలతోనూ సంబంధాలున్నట్లు సమాచారం. హైదరాబాదులో పట్టుబడిన ఖలీద్ ను పోలీసులు ఢిల్లీకి తరలిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్వాన్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బాంబులు తయారు చేస్తుండగా, ప్రమాదవశాత్తు బాంబులు పేలిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News