: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం
హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో ఏపీ రాజధానికి సంబంధించి రెండు కీలకమైన బిల్లులకు ఆమోదం లభించనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, అత్యంత విలువైన ఎర్రచందనాన్ని కాపాడుకునేందుకు, స్మగ్లర్లకు చెక్ పెట్టేందుకు సంబంధించి కూడా చర్చ జరగనుంది.