: అసెంబ్లీ 10 నిమిషాలు వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం కూడా సోమవారం నాటి తరహాలోనే వాయిదాల పర్వం ప్రారంభమైంది. ప్రారంభమైన పది నిమిషాలకే సభను 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. పార్టీ ఫిరాయింపులపై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాల్సిందేనని పట్టుబట్టిన కాంగ్రెస్ ప్రశ్నోత్తరాలను అడ్డుకుంది. దీంతో స్పీకర్ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు.