: కాశ్మీర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థుల్లో 40 శాతం మంది ముస్లింలే!


జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థుల ఎంపికలో మునుపెన్నడూ లేని విధంగా మైనార్టీలకు మరింత ప్రాధాన్యమిస్తూ ముందుకు దూసుకెళుతోంది. ఆ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ముస్లింలకు 40 శాతం సీట్లను కేటాయించింది. 87 సీట్లున్న కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘మిషన్ 44 ప్లస్’ వ్యూహంతో ఎన్నికల బరిలో దిగుతున్న ఆ పార్టీ, తాము అధికారం చేపట్టడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మొత్తం 70 స్థానాలకు పైగా ఆ పార్టీ పోటీ చేస్తుండగా, వాటిలో 32 సీట్లను ముస్లింలకు కేటాయించింది. కాశ్మీర్ లోయలో 25 మంది, జమ్మూలో ఆరుగురు, లడఖ్ లో ఒకరు చొప్పున ముస్లింలు ఆ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నారు. అంతేకాక ఈ ఎన్నికల్లో కాశ్మీరీ పండిట్లు, సిక్కు, బౌద్ధులకు కూడా బీజేపీ టికెట్లిచ్చింది.

  • Loading...

More Telugu News