: ఒకే వేదికపై రాజ్, ఉద్ధవ్ ఠాక్రే... శివసేన, ఎంఎన్ ఎస్ కలుస్తాయా?


సమీప భవిష్యత్తులో శివసేనలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన విలీనమవుతుందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అలానే అనిపిస్తోంది. 'మహా' రాజకీయాలలో సమీకరణాలు మారుతున్నాయి అనడానికి సంకేతంగా దివంగత బాల్ ఠాక్రే రెండవ వర్థంతి సభలో పాల్గొన్న రాజ్, ఉద్ధవ్ లు దాదాపు 20 నిమిషాల సేపు ముచ్చటించుకున్నారు. 2005లో శివసేన అధ్యక్షుడిగా ఉద్ధవ్ ఠాక్రేను నియమించడంతో అలిగిన రాజ్ 'మహారాష్ట్ర నవనిర్మాణ సేన' పేరిట కొత్త పార్టీని పెట్టుకున్నాడు. ఆపై 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 13 చోట్ల విజయం సాధించగా, ఈ దఫా ఒక్క స్థానానికి పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. మరోవైపు, శివసేన సైతం బీజేపీ హవాతో ప్రాభవాన్ని కోల్పోయే పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రాజ్, ఉద్ధవ్ ల కలయిక రెండు పార్టీల విలీనానికి దారి తీయవచ్చని రాజకీయ వర్గాల అంచనా.

  • Loading...

More Telugu News