: భారత్ ఎందుకు వెనుకబడిందో అర్థం కావడంలేదు: మోదీ
అభివృద్ధి పథంలో భారత్ వెనుకబాటుతనానికి కారణం ఏంటో తనకు ఇంకా అర్థం కాలేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత్ కు చెందిన ఎందరో ప్రపంచ దేశాల్లో తమ సత్తా చాటారని ఆయన గుర్తు చేశారు. భారతదేశంలో నిరుపేదల నీతి, నిజాయతీలకు మోదీ సలాం చేశారు. జన్ ధన్ యోజన కింద ఒక్క రూపాయి కూడా వేయక్కర్లేకుండానే ఖాతాలను ప్రారంభించుకోవచ్చని చెప్పగా, కోట్లమంది పేదలు 100, 200 రూపాయల చొప్పున జమచేసి ఖాతాలను తెరవగా, మొత్తం 5 వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయని ప్రవాస భారతీయుల కరతాళ ధ్వనుల మధ్య తెలిపారు.