: నాలుగు రోజుల్లో రుణమాఫీ తొలి విడత చెల్లింపుల ప్రక్రియ పూర్తి
రైతు రుణమాఫీలో భాగంగా తొలి విడత చెల్లింపులను నాలుగు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇదివరకే ప్రకటించిన మాదిరిగా రూ.50 వేల కంటే తక్కువ రుణం ఉన్న రైతుల రుణాలను ఒకే విడతలో మాఫీ చేస్తామని ఆయన వెల్లడించారు. తొలి విడత చెల్లింపులను బ్యాంకులకు విడుదల చేయడంతో పాటు మలి విడత చెల్లింపులపైనా పకడ్బందీగా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు.