: సబర్మతి నదిపై తేలియాడే రెస్టారెంట్
గుజరాత్ లోని సబర్మతి నదిపై రివర్ క్రూయిజ్ సదుపాయం అందుబాటులోకి రానుంది. అహ్మదాబాద్ పరిధిలో ప్రవహిస్తున్న సబర్మతి నదిలో తేలియాడే రెస్టారెంట్ ను త్వరలో ప్రారంభిస్తామని నగర డిప్యూటీ కమిషనర్ ఎం తెన్నరాసన్ వివరించారు. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దగ్గరుండి పర్యవేక్షించిన ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అందుబాటు ధరల్లో నీటిపై తేలియాడే పడవపై కూర్చుని మనకు ఇష్టమైన ఫలహారాలను భుజిస్తూ ఆస్వాదించే సదుపాయం కలగనుంది. ఈ రెస్టారెంట్ లను పార్టీల కోసం అద్దెకు కూడా ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. మొత్తం 3 కోట్ల రూపాయలను ఇందుకోసం ఖర్చు చేయనున్నట్టు వివరించారు.