: భారీ నష్టాల్లో స్పైస్ జెట్ షేరు విలువ
సోమవారం నాటి స్టాక్ మార్కెట్ సెషన్ లో లోకాస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ స్పైస్ జెట్ వాటా విలువ 11 శాతం నష్టపోయింది. సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ ఖర్చులు ఆదాయం కన్నా ఎక్కువగా ఉన్నాయని, సంస్థ నిర్వహణ భారంగా మారుతోందని ఆడిటర్లు ఇచ్చిన నివేదిక ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ ను బలహీనపరిచిందని తెలుస్తోంది. దీంతో బీఎస్ఈలో స్పైస్ జెట్ షేరు విలువ ప్రస్తుతం 14 రూపాయల వద్ద కొనసాగుతోంది.