: నేడు, రేపు ఢిల్లీలో నెహ్రూపై కాంగ్రెస్ 'అంతర్జాతీయ సదస్సు'


భారత తొలి ప్రధాని, దివంగత జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో నేడు, రేపు 'అంతర్జాతీయ సదస్సు' జరగనుంది. విజ్ఞాన్ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న తొలి రోజు సదస్సుకు ఎన్డీయేతర పార్టీలన్నీ హాజరయ్యాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, మాజీ ప్రధాని దేవగౌడ, సీపీఐ నేత సీతారామ్ ఏచూరి, రాజా తదితరులు హాజరయ్యారు. ఇటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య కూడా వచ్చారు. అంతేగాక కాంగ్రెస్ ఆహ్వానం మేరకు 50 దేశాల ప్రతినిధులు కూడా సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నెహ్రూ జీవిత విశేషాలపై కాంగ్రెస్ ఓ వెబ్ సైట్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News