: కోర్టుకు హాజరయ్యే ప్రసక్తే లేదు: వివాదాస్పద స్వామి రాంపాల్


మీరు ఎన్నైనా చెప్పండి...కోర్టుకు హాజరయ్యేది మాత్రం లేదంటూ హర్యానాలోని వివాదాస్పద స్వామి రాంపాల్ మొండికేస్తున్నారు. మొన్నటికి మొన్న పోలీసులను నిలువరించేందుకు తన భక్తులకు కర్రలు, హెల్మెట్లిచ్చి గేటు ముందు నిలిపిన రాంపాల్, ఇప్పుడు కూడా అదే వైఖరిని కొనసాగిస్తున్నారు. బర్వాలా పట్టణంలోని సత్ లోక్ పేరిట ఏర్పాటైన ఆశ్రమంలో కొలువైన రాంపాల్ కు భక్తుల సంఖ్య లక్షలు దాటింది. ఓ కేసులో ఆయన ఇప్పటికే కొంతకాలం పాటు జైలులోనూ ఉండి వచ్చారు. అయితే భక్తుల సంఖ్య పెరగడంతో బలోపేతమైన ఆయన కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించేందుకు వెనుకాడటం లేదు. అంతేకాక భక్తుల చేత ఆందోళనలు చేయిస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. దీంతో అటు కోర్టు ఆదేశాలు అమలు చేయలేక, ఇటు స్వామిని కోర్టు ముందు హాజరుపరచలేెక హర్యానా పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. స్వామి అనారోగ్యంతో ఉన్నారని, సదరు విషయాన్ని రూఢీ చేసేందుకు అవరమైన పత్రాలను కోర్టుకు సమర్పిస్తామని ఆశ్రమ ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారు.

  • Loading...

More Telugu News