: మళ్లీ అరగంట పాటు సభ వాయిదా


తెలంగాణ అసెంబ్లీ మరోమారు వాయిదా పడింది. సోమవారం సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టిన కాంగ్రెస్ వైఖరితో తొలుత సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటించారు. అయితే, ఆ తర్వాత తిరిగి సభ ప్రారంభమైనా కాంగ్రెస్ సభ్యులు తమ పట్టు వీడలేదు. తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాల్సిందేనని భీష్మించారు. అంతకుముందు కేటీఆర్ తమపై చేసిన వ్యాఖ్యలపైనా కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో మరోమారు సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో విధి లేని పరిస్థితిలో సభను అరగంట పాటు వాయిదా వేస్తూ స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.

  • Loading...

More Telugu News