: వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థ యాత్రలకు వెళ్లినట్టుంది: కాంగ్రెస్ పై కేటీఆర్ మండిపాటు


తెలంగాణ శాసన సభలో కాంగ్రెస్ పార్టీ తీరుపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే పార్టీ ఫిరాయింపులపై తానిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ సభ్యులు చర్చ కోసం నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్, ఆ పార్టీ సభ్యులపై విరుచుకుపడ్డారు. ‘వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లు, పార్టీ ఫిరాయింపులను పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేమో దానిపైనే గగ్గోలు పెడుతోంది’ అంటూ ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News