: ఉస్మానియాలో ఉద్రిక్తత... పోలీసుల బందోబస్తు


ఉస్మానియా నిరుద్యోగ జేఏసీ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యూనివర్శిటీ ఎన్ సీసీ గేట్ వద్ద పికెట్ ఏర్పాటు చేసి ఓయూ మీదుగా తార్నాక వెళ్లే వాహనాలను అంబర్ పేట వైపు మళ్ళిస్తున్నారు. దీంతో అటు యూనివర్సిటీలోనూ ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ విధానాలను నిరసిస్తూ నిరుద్యోగ జేఏసీ సోమవారం నాడు అసెంబ్లీని ముట్టడించాలని నిర్ణయించడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News