: ఆర్ కే బీచ్ లో ‘రిజువనేషన్ విశాఖ’ కార్యక్రమాలు ప్రారంభం!
హుదూద్ చేదు అనుభవాల నుంచి తేరుకునేందుకు ఉద్దేశించిన ‘రిజువనేషన్ విశాఖ’ కార్యక్రమం కొద్దిసేపటి క్రితం నగరంలోని ఆర్ కే బీచ్ లో ప్రారంభమైంది. ఉధయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా నిర్విరామంగా కొనసాగనున్న ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా ఏపీ కేబినెట్ మంత్రులు కూడా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులే కాక సినీ రంగానికి చెందిన దిగ్గజాలు కూడా పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి రాత్రి దాకా జరగనున్న సాంస్కృతిక కార్యక్రమాలు విశాఖ వాసులను ఉర్రూతలూగిస్తాయి.