: బంతితోనూ సత్తా చాటిన మాథ్యూస్... వెనుదిరిగిన రోహిత్, రహానే
బ్యాటింగ్ లో సెంచరీతో అదరగొట్టిన శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ బంతితోనూ రాణించాడు. టీమిండియా ఓపెనర్లు రహానే (2), రోహిత్ శర్మ (9)లను మాథ్యూస్ బౌల్డ్ చేశాడు. దీంతో, భారత్ 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, కెప్టెన్ విరాట్ కోహ్లీ (33 బ్యాటింగ్), అంబటి రాయుడు (19 బ్యాటింగ్) జోడీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడింది. ప్రస్తుతం భారత్ 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది.