: ఇకపై విదేశీ పర్యాటకులకు భారత్ లో రెడ్ కార్పెట్ స్వాగతం
భారత్ లో పర్యటించే విదేశీ యాత్రికులకు ఇకమీదట ఘనంగా స్వాగతం పలకనున్నారు. 'అతిథి దేవో భవ' అన్న సూక్తిని అక్షరాలా అమలు చేసేందుకు టూరిజం మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. ఈ పథకంలో భాగంగా, విదేశాల నుంచి భారత్ ఎయిర్ పోర్టుల్లో అడుగుపెట్టే టూరిస్టులను పూమాలలతో సాదరంగా ఆహ్వానిస్తారు. వారు తమ యాత్ర ముగించుకుని వెళ్లిపోయేవరకు శిక్షణ పొందిన సిబ్బంది సేవలందిస్తారు. ఈ సిబ్బంది పర్యాటకులకు రవాణా విషయంలో తోడ్పాటునందించడమే కాకుండా, గైడ్లుగానూ వ్యవహరిస్తారు. విదేశీ టూరిస్టులకు సురక్షితమైన భావనను కలిగించడమే ఈ నూతన విధానం ముఖ్యోద్దేశమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ పేర్కొన్నారు.