: సల్మాన్ సోదరి పెళ్లి విందులో స్పెషల్ వంటకాలు


బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత వివాహం ఈ నెల 18న హైదరాబాదులో జరగనున్న సంగతి తెలిసిందే. సుప్రసిద్ధ ఫలక్ నుమా ప్యాలెస్ ఈ పరిణయ వేడుకకు వేదికగా నిలుస్తోంది. కాగా, అతిథుల కోసం ప్రత్యేక వంటకాలతో మెనూ రూపొందించారట. వాటిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 'హైదరాబాద్ బిర్యానీ'తో పాటు 'హలీమ్', 'పత్తర్ కా ఘోష్' తదితర రుచికరమైన డిషెస్ ఉన్నాయట. ఢిల్లీ వ్యాపారవేత్త ఆయుష్ శర్మతో జరిగే తన సోదరి వివాహానికి సల్మాన్ ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించడం తెలిసిందే. సినీ రంగ ప్రముఖులే కాకుండా, రాజకీయ రంగం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పెళ్లికి హాజరవనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News