: అన్నపూర్ణ స్టూడియోలో నీతా అంబానీ పరివారానికి 'మనం' ప్రత్యేక ప్రదర్శన!


హైదరాబాదులో ప్రసిద్ధిగాంచిన అన్నపూర్ణ స్టూడియోను కార్పొరేట్ రంగ ప్రముఖులు నీతా అంబానీ, స్వాతి పిరమాల్, నవాజ్ సింఘానియా, అనన్య గోయెంకా, లీనా తివారీ, అనుప షెహ్నాయ్, రాధిక సేథ్, నటి జుహీ చావ్లా సందర్శించారు. నాగార్జున వీరికి స్వాగతం పలికారు. అనంతరం వారికి స్టూడియోలోని పలు విభాగాలను దగ్గరుండి చూపించారు. ఈ సందర్భంగా వారికోసం అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం 'మనం' ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News