: వేలానికి నెపోలియన్ టోపీ... రూ.15 కోట్లు పలుకుతుందట!
చరిత్రలో నిలిచిపోయిన చక్రవర్తుల్లో నెపోలియన్ బోన పార్టే ఒకడు. ఈ ఫ్రెంచి రారాజుకు చెందిన టోపీ ఇప్పుడు వేలానికి వచ్చింది. రెండు వైపులా వంచబడిన ఈ టోపీకి రూ.15 కోట్ల వరకు ధర పలకవచ్చని నెపోలియన్ వస్తువుల సంరక్షకులు అంచనా వేస్తున్నారు. ఆదివారం నాడు ఫ్రాన్స్ లోనే ఈ వేలం జరగనుంది. 1804 నుంచి 1814 వరకు, 1815లో ఫ్రెంచి సామ్రాజ్యాన్ని పాలించిన నెపోలియన్ వద్ద 120 వరకు టోపీలు ఉండేవట. వాటిలో ప్రస్తుతం 20 టోపీలు మాత్రం మిగిలాయి. అందులోనూ రెండు మూడు టోపీలు ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉండగా, మిగతావి పురావస్తు ప్రదర్శన శాలల్లో ఉన్నాయి.