: మహిళలు దేశానికి వెన్నెముక: సచిన్
మహిళలు దేశానికి వెన్నెముకలాంటి వారని మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. ఆదివారం పుట్టంరాజువారి కండ్రిగలో పర్యటించిన ఆయన అక్కడి స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సమాజంలో మహిళ పాత్రపై మాట్లాడారు. తనకు ప్రభుత్వం అందజేసిన భారతరత్నను మహిళామూర్తులకే అంకితమిస్తున్నట్లు సచిన్ ప్రకటించారు. గ్రామం అభివృద్ధిలో భాగంగా మహిళలు కీలక భూమిక పోషించాలని కోరారు. మరుగుదొడ్లను నిర్మించుకోవడమే కాక వాటిని సక్రమంగా నిర్వహించుకునే విషయంలోనూ మెలకువలను నేర్చుకోవాలని ఆయన మహిళలకు సూచించారు.