: తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా
తీవ్ర అస్వస్థతకు గురైన తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోగ్యం నిలకడగా ఉంది. శనివారం నగరంలో పర్యటన ముగించుకుని ఇంటికి చేరుకున్న ఆయన, కారు దిగుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వెంకటరమణకు ప్రస్తుతం రెండు కిడ్నీలు పనిచేయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. మరికొద్దిసేపటిలో వెంకటరమణ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వాకబు చేశారు. మరోవైపు వెంకటరమణ కుటుంబ సభ్యులను కలిసిన వైఎస్సార్సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆయన ఆరోగ్యంపై అడిగి తెలుసుకున్నారు.