: మెట్రో రైలు మార్గంలో మార్పులకు ఆమోదం!


హైదరాబాద్ మెట్రో రైలు మార్గంలో మార్పులకు కేసీఆర్ సర్కారు, ఎల్ అండ్ టీ అంగీకరించాయి. దీంతో నగరంలోని అసెంబ్లీ, పాత బస్తీ, సుల్తాన్ బజార్ లలో మెట్రో రైలు మార్గాలు మారనున్నాయి. ముందుగా ప్రతిపాదించిన మేరకు అసెంబ్లీ ముందు నుంచి మెట్రో రైలు మార్గం ఏర్పాటు కావాల్సి ఉంది. తాజాగా అసెంబ్లీ వెనుక వైపుకు ఈ మార్గం మారింది. అంతేకాక పాతబస్తీ, సుల్తాన్ బజార్లలోనూ మెట్రో రైలు మార్గాన్ని మార్చాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలకు ఎల్ అండ్ టీ సంస్థ అంగీకరించింది. అలైన్ మెంట్ మార్పులకు అయ్యే ఖర్చును భరించేందుకు ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో ఎల్ అండ్ టీ ఈ మేరకు ఒప్పుకుంది. శనివారం ఇరుపక్షాల మధ్య జరిగిన చర్చల్లో మెట్రో మార్గాల మార్పిడికి సంబంధించి అంగీకారం కుదిరింది.

  • Loading...

More Telugu News