: ఆ రోజు కోసం ఎదురు చూస్తాం: మోదీ ప్రకటనపై డిగ్గీరాజా స్పందన


విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తామని జీ-20 వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. నల్లధనాన్ని మోదీ దేశానికి తీసుకువచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్నామంటూ ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ శనివారం వ్యాఖ్యానించారు. ‘ఈ విషయంలో మోదీ తీసుకుంటున్న చర్యలు సంతోషకరం. మొత్తం నల్లధనం తిరిగి దేశానికి తరలివచ్చే రోజు కోసం ఎదురుచూస్తున్నాం. ఆ రోజు భారత్ కు నిజంగా మంచి రోజే’నని డిగ్గీరాజా అన్నారు.

  • Loading...

More Telugu News